Telugu Global
Cinema & Entertainment

Manchu Manoj | రాజకీయాలపై మంచు మనోజ్ అభిప్రాయం

Manchu Manoj - హీరో మంచు మనోజ్, రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాడో తెలిపాడు.

Manchu Manoj | రాజకీయాలపై మంచు మనోజ్ అభిప్రాయం
X

మంచు కుటుంబాన్ని, రాజకీయాల్ని విడదీసి చూడలేం. మోహన్ బాబుకు రాజకీయాలు కొత్త కాదు. ఆయన అడుగుజాడల్లో మంచు మనోజ్ కూడా నడిచాడు. అయితే తను ఏ పార్టీకి కొమ్ముకాయలేదని, కేవలం నాన్నకు సహాయంగా మాత్రమే నిలిచానంటున్నాడు.

"నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. నేను మా నాన్నకు సపోర్ట్ చేశాను. ఆ పరిస్థితుల్లో ఊరిలో ఉన్నాను కాబట్టి నాన్నతో కలిసి వెళ్లాను. పైగా నేను ఎప్పుడూ ఫలానా పార్టీకి ఓటు వేయమని చెప్పలేదు, నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు పోటీలో ఉంటే, వాళ్లకు ఓటు వేయమని చెప్పానంతే. ఇన్నాళ్లూ వ్యక్తిగత స్థాయిలోనే సపోర్ట్ చేశాను."

ఇలా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇన్నాళ్లూ తన నాన్న కోసం రాజకీయాల్లో పాల్గొన్నానని, ఇకపై తన భార్య కోసం రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తన భార్య మౌనిక, ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే, తను అటువైపు ఉంటానని ప్రకటించాడు. మౌనికకు రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే.

దాదాపు ఏడేళ్లుగా సినిమాలకు దూరమయ్యాడు మంచు మనోజ్. ఈ ఏడేళ్లలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని, కచ్చితంగా మరోసారి సినిమాల్లోకి వస్తానని అంటున్నాడు ఈ మంచు హీరో.

First Published:  7 Dec 2023 4:11 PM GMT
Next Story