Telugu Global
Cinema & Entertainment

BubbleGum | తెలుగు తెరపైకి మరో తెలుగమ్మాయి

BubbleGum - సుమ కొడుకు హీరోగా పరిచయమౌతున్న సినిమా బబుల్ గమ్. ఇదే సినిమాతో ఓ హీరోయిన్ కూడా పరిచయమౌతోంది.

BubbleGum | తెలుగు తెరపైకి మరో తెలుగమ్మాయి
X

రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి మీడియా మాట్లాడింది.

"నేను చిత్తూరు జిల్లా పుత్తూరులో పుట్టాను. చెన్నైలో పెరిగాను. నాన్న బిజినెస్ చేస్తారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. పరిశ్రమలోకి వెళ్తానని చెప్పినపుడు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను. ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ కి నా ప్రొఫైల్ పంపించాను. ఆయనకి నచ్చింది. ఫోటో షూట్ చేసి నన్ను తీసుకున్నారు."

అలా తన కెరీర్ మొదలైందని చెప్పుకొచ్చింది మానస. బబుల్ గమ్ తో హీరోయిన్ గా మారిన ఈ అచ్చతెలుగమ్మాయి.. సినిమాలో లవ్, రెస్పెక్ట్ గురించి చర్చించామని చెబుతోంది. దర్శకుడు తనతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కెమెరా భయం లేకుండా పోయిందని చెబుతోంది.

ఇక హీరో రోషన్ కనకాల గురించి మాట్లాడుతూ.. రోషన్ చాలా కూల్ గా ఉంటాడని, అతడ్ని చూస్తే తొలి సినిమా హీరోలా అస్సలు అనిపించలేదని అంటోంది. బబుల్ గమ్ సక్సెస్ పై ఈ ముద్దుగుమ్మ కోటి ఆశలు పెట్టుకుంది.





First Published:  27 Dec 2023 4:58 PM GMT
Next Story