Telugu Global
Cinema & Entertainment

Malvika Sharma | దేవిగా మారిన మాళవిక శర్మ

Malvika Sharma - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోంహర. ఈ సినిమా నుంచి మాళవిక శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Malvika Sharma | దేవిగా మారిన మాళవిక శర్మ
X

సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు లుక్ రిలీజైంది. తాజాగా హీరోయిన్ మాళవిక శర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో ఆమె పాత్ర పేరు దేవి. మాళవిక చీరలో అందంగా, సాంప్రదాయకంగా ఆకట్టుకుంది. ఆమె సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చిరునవ్వులు చిందిస్తోంది.

సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నాడు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

హరోంహర సినిమాకు ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో ఇది తిరుగుబాటు, ప్రతీకారానికి సంబంధించిన సినిమాగా ఆర్థమౌతుంది. సుధీర్ బాబు కెరీర్ లో హై బడ్జెట్‌ మూవీ గా వస్తున్న 'హరోం హర' సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.

First Published:  16 Nov 2023 3:58 PM GMT
Next Story