Telugu Global
Cinema & Entertainment

Devil | డిఫరెంట్ గెటప్ లో మాళవిక నాయర్

Malvika Nair - డెవిల్ సినిమాలో కీలక పాత్ర పోషించింది మాళవిక నాయర్. ఆ పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Devil | డిఫరెంట్ గెటప్ లో మాళవిక నాయర్
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

మ‌ణిమేక‌ల పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ క‌నిపించ‌నుంది. ఆమె లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లో క‌నిపిస్తోంది. మైకు ముందు నిలబ‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ట్లు ఉంది. అయితే ఆమె పాత్ర‌కు ఈ సినిమాకు క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం న‌వంబ‌ర్ 24 వరకు ఆగాల్సిందే.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నాడు. ‘బింబిసార’తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో, డెవిల్ తో కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ ఇస్తానంటున్నాడు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మించడంతో పాటు, దర్శకుడిగా కూడా తన పేరు వేసుకున్నాడు. ఏ ఫిలిం బై అభిషేక్ పిక్చర్స్ అనే కార్డ్ కూడా వేసుకున్నాడు.




First Published:  16 Oct 2023 2:47 AM GMT
Next Story