Telugu Global
Cinema & Entertainment

Malli Pelli Movie OTT: ఒకేసారి 2 ఓటీటీల్లో నరేష్ సినిమా

Malli Pelli Movie OTT: నరేష్ నటించిన సిల్వర్ జూబ్లీ సినిమా ఇది. ఇప్పుడీ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రానుంది.

Malli Pelli Movie Review: మళ్ళీ పెళ్లి –రివ్యూ!
X

Malli Pelli Movie Review: మళ్ళీ పెళ్లి –రివ్యూ!

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ చిత్రం "మళ్ళీ పెళ్లి". సీనియర్ నటుడు నరేష్ అలాగే నటి పవిత్ర లోకేష్ జంటగా దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ అయింది. చాన్నాళ్ల కిందటే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. విడుదలకు ముందు వివాదాస్పదమైన ఈ సినిమాను ఈ జూన్ 23 నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.

ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో కూడా అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు నాన్-ఎక్స్ క్లూజివ్ కింద రైట్స్ అమ్మారు నిర్మాత కమ్ హీరో నరేష్.

సో.. ఈ రెండు ఓటీటీల్లో, ఈ శుక్రవారం నుంచి మళ్లీ పెళ్లి సినిమా, మరోసారి అలరించబోతోందన్నమాట. సీనియర్ నటుడు నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలు, అతడి సహజీవనం, మూడో పెళ్లిలో తలెత్తిన ఇబ్బందులు.. లాంటి అంశాలన్నింటినీ ఈ సినిమాలో ఫిక్షనల్ గా చర్చించారు. తన నిజజీవిత పాత్రను నరేష్ పోషించగా.. పవిత్ర కూడా తన నిజజీవిత పాత్రలో నటించారు. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో వనిత విజయ్ కుమార్ నటించారు.

నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని మరింత ఫిక్షనలైజ్ చేయడం, వనిత విజయ్ కుమార్ పాత్రను విలన్ గా చూపించడం, పవిత్ర లోకేష్ ఫ్లాష్ బ్యాక్ మరింత షాకింగ్ గా ఉండడం ఈ సినిమాలో హైలెట్స్. సురేష్ బొబ్బిలి, అరుణ్ దేవ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

First Published:  21 Jun 2023 2:57 PM GMT
Next Story