Telugu Global
Cinema & Entertainment

Malli Pelli - మళ్లీ పెళ్లి విడుదల తేదీ ఫిక్స్

Malli Pelli Movie - సీనియర్ నరేష్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేశారు.

Malli Pelli - మళ్లీ పెళ్లి విడుదల తేదీ ఫిక్స్
X

సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’. సొంత బ్యానర్ పై స్వయంగా నరేష్ నిర్మిస్తున్న సినిమా ఇది. పైగా ఇది అతడి నిజజీవితానికి దగ్గరగా ఉన్న సినిమా కూడా. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ హీరోయిన్. ఎంఎస్ రాజు రచన దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మళ్లీ పెళ్లి సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో నరేష్ , పవిత్ర లోకేష్ తమ అనురాగ బంధాన్ని పంచుకున్నారు. పోస్టర్‌లో ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ కనిపించారు.

సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.

First Published:  3 May 2023 5:22 PM GMT
Next Story