Telugu Global
Cinema & Entertainment

Small Movies - కోటి రూపాయలు దాటిన చిన్న సినిమాలు

Malli Pelli, Mem Famous, 2018 Movie - ఇవన్నీ చిన్న సినిమాలే. కానీ మొదటి రోజు కోటి రూపాయల గ్రాస్ సాధించాయి.

Small Movies - కోటి రూపాయలు దాటిన చిన్న సినిమాలు
X

ఈ వీకెండ్ మళ్లీ పెళ్లి, మేమ్ ఫేమస్, 2018 లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిన్న సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ రావనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలపై ఉన్న హైప్ కారణంగా, తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ముందుగా మళ్లీ పెళ్లి విషయానికొద్దాం.. నరేష్-పవిత్ర నిజజీవితంలో జరిగిన ఘటనలతో ఈ సినిమా తెరకెక్కింది. అందుకే మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ వచ్చాయి. అలా మొదటి రోజు ఈ సినిమాకు కోటి రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే విడుదలకు ముందు ఉన్న హైప్, విడుదల తర్వాత ఈ సినిమాకు లేదు. కాబట్టి, సోమవారం నుంచి ఈ సినిమా రన్ ఎలా ఉంటుందనేది చూడాలి.

ఇక మేమ్ ఫేమస్ అనే సినిమాది కూడా ఇదే పరిస్థితి. మహేష్ బాబు, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి స్టార్స్ తో ఈ సినిమాకు ప్రచారం కల్పించారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే రిలీజైన మొదటి రోజే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ భారీ ప్రచారం కారణంగా తొలి రోజు ఈ సినిమాకు కోటి 11 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఇక 2018 సినిమా సాలిడ్ హిట్ గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమాను మీడియాకు ప్రదర్శించారు. ఆల్రెడీ మలయాళంలో హిట్టయిన మూవీ కావడంతో, టాలీవుడ్ మీడియాకు కూడా నచ్చింది. అలా విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, శుక్రవారం నాటి విడుదలతో, సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాకు కూడా మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది.

First Published:  27 May 2023 10:53 AM GMT
Next Story