Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

అలనాటి టాప్ హీరోయిన్ మాలాశ్రీ. ఇప్పుడీ నటి కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఓ పాన్ ఇండియా సినిమాతో మాలాశ్రీ కూతురు రాధనా వస్తోంది.

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు
X

ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. నటుడు దర్శన్ సరసన ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వూబోతోంది. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ చిత్రం ప్రారంభమైంది. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రవిశంకర్ గురూజీ స్వయంగా హాజరై సినిమా తొలి షాట్‌కి కెమెరా స్విచాన్ చేశారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు మాలాశ్రీ. ఒక దశలో లేడీ ఓరియంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ హీరోయిన్ గా పరిచయం కావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

తల్లి మాలశ్రీ బాటలోనే తన తొలి సినిమాకు యాక్షన్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుంది రాధనా. బెంగళూరులోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తొలి చిత్రానికే తనకు నటించడానికి స్కోప్ ఉండే మంచి పాత్ర దొరికిందని చెబుతోంది రాధనా.

First Published:  8 Aug 2022 7:58 AM GMT
Next Story