Telugu Global
Cinema & Entertainment

Mahesh Trivikram Movie: నిరవధికంగా వాయిదాపడిన షూటింగ్

Mahesh Trivikram Movie: తండ్రిని కోల్పోయాడు మహేష్ బాబు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. దీంతో అతడి తాజా చిత్రం షూటింగ్ నిరవథికంగా వాయిదా పడింది.

Mahesh Trivikram Movie: నిరవధికంగా వాయిదాపడిన షూటింగ్
X

ఊహించని విధంగా తండ్రిని కోల్పోయాడు మహేష్. ఈ హీరోతో పాటు, అతడి అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో మహేష్ చేయాల్సిన సినిమా నిరవథికంగా వాయిదా పడింది. లెక్కప్రకారం, ఈ నెలాఖరు నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలి మహేష్. కానీ ఆ షెడ్యూల్ నిలిచిపోయింది.

మహేష్-త్రివిక్రమ్ దర్శకత్వంలో రావాల్సిన సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు నిలిచిపోతూనే ఉంది. కేవలం 5 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ నిర్వహించారు. ఆ తర్వాత అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి.

నిజానికి గత నెల్లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాలి. కానీ తన తల్లిని కోల్పోయాడు మహేష్. అలా సినిమా షూటింగ్ వాయిదాపడింది. అప్పట్నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు.

తాజాగా 2 రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పై చిన్నపాటి క్లారిటీ వచ్చింది. నెలాఖరు నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటూ సమాచారం వచ్చింది. అంతలోనే తండ్రి కృష్ణను కోల్పోయాడు మహేష్. దీంతో ఈ సినిమా షూటింగ్ ను నిరవథికంగా వాయిదా వేశారు.

తండ్రి లేని లోటు మహేష్ కు చాలా పెద్ద దెబ్బ. దీన్నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. తమ హీరో వీలైనంత త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

First Published:  15 Nov 2022 2:58 AM GMT
Next Story