Telugu Global
Cinema & Entertainment

Mahesh Vs Prabhas - ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి పోటీ

Mahesh Vs Prabhas - ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోంది.

Mahesh Vs Prabhas - ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి పోటీ
X

ఏటా సంక్రాంతికి పోటీ కామన్. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీపడ్డాయి. మధ్యలో మరో 2 సినిమాలు కూడా వచ్చాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ మాత్రం పూర్తిగా భిన్నం. ఇప్పటివరకు టాలీవుడ్ లో కనివినీ ఎరుగని పోటీ ఇది.

ఈసారి సంక్రాంతి పోటీ పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోంది. అవును.. మహేష్-ప్రభాస్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ఈసారి పోటీ హోరాహోరీగా ఉండబోతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

మహేష్ సినిమా కంటే ముందే ప్రాజెక్ట్-కె సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోన్ హీరోయిన్.

ఇలా ఇద్దరు పెద్ద హీరోలు సంక్రాంతికి పోటీపడుతున్నారు. పైగా ఇలా 9 నెలల ముందే సంక్రాంతి వార్ కు ఇద్దరూ సిద్ధమవ్వడం చెప్పుకోదగ్గ విశేషం.

First Published:  27 March 2023 3:00 PM GMT
Next Story