Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: మహేష్ మూవీ ఈ నెలలో షూట్ లేదు

Mahesh Babu: లెక్కప్రకారం ఈనెలలో సెట్స్ పైకి రావాలి మహేష్ మూవీ. కానీ జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పెట్టుకున్నారు.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

ముందు డిసెంబర్ ఫస్ట్ వీక్ అన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 9 అన్నారు.. ఆ తర్వాత డిసెంబర్ 16 అన్నారు. మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇలా రోజుకో తేదీ తెరపైకొచ్చి అందర్నీ కన్ఫ్యూజ్ చేసింది. అయితే నిజం ఏంటంటే, ఈ సినిమా అసలు ఈ నెలలో సెట్స్ పైకి రావడం లేదు.

మహేష్-త్రివిక్రమ్ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఈసారి ఇది గాసిప్ కాదు. స్వయంగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా మరో బ్రేకింగ్ న్యూస్ కూడా బయటపెట్టింది.

జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ను నాన్ స్టాప్ గా చేస్తారట. తాజా షెడ్యూల్ తో ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రాదనే విషయం స్పష్టమైంది. ఒకవేళ నాన్ స్టాప్ గా షూట్ నిర్వహిస్తే, దసరాకు వచ్చే అవకాశం ఉంది.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.

First Published:  10 Dec 2022 11:59 AM GMT
Next Story