Telugu Global
Cinema & Entertainment

#SSMB28 - మహేష్ కొత్త సినిమాపై ఫుల్ క్లారిటీ

SSMB28 - ఈనెల 31న మహేష్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ విడుదల కానుంది. దీనికోసం ఓ సరికొత్త ఆలోచన చేశారు.

#SSMB28 - మహేష్ కొత్త సినిమాపై ఫుల్ క్లారిటీ
X

అతడు, ఖలేజా వంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ మహేష్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇప్పుడు టైటిల్ ప్రకటించే టైమ్ వచ్చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న టైటిల్ ని రివీల్ చేస్తున్నారు. కృష్ణ గారు నటించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటైన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4K లో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మోసగాళ్లకు మోసగాడు రిలీజయ్యే అన్ని థియేటర్లలో మహేష్ కొత్త సినిమా గ్లింప్స్ ను ప్రసారం చేస్తారు.

ఈ విడుదల కార్యక్రమం కృష్ణ అభిమానుల చేతుల మీదుగా జరగనుంది. 'మాస్ స్ట్రైక్' పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్ అభిమానులకి మాస్ ఫీస్ట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక తండ్రి జయంతి సందర్భంగా ఆయన సినిమా మళ్లీ విడుదల కావడం, ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కొడుకు సినిమా గ్లింప్స్ విడుదల చేయడం అనేది సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘటనకు #SSMB28 శ్రీకారం చుట్టింది.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

First Published:  27 May 2023 10:44 AM GMT
Next Story