Telugu Global
Cinema & Entertainment

మహేష్ తిరిగొచ్చాడు.. మూవీ పరిస్థితేంటి?

మహేష్ విదేశాల నుంచి తిరిగొచ్చాడు. మరి అతడి కొత్త సినిమా పరిస్థితేంటి? ఈసారి సెట్స్ పైకి వెళ్లడానికి అక్కండి ఏంటి?

trivikram-went-to-germany
X

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఎంతలా వెయిట్ చేస్తున్నారో, ఆ మూవీ అంత లేట్ అవుతూ వస్తోంది. మొన్నటికిమొన్న మహేష్ విదేశాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగొచ్చాడు. ఇక సినిమా స్టార్ట్ అవ్వడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ అంతలోనే ఈ హీరో మళ్లీ విదేశాల బాట పట్టాడు.

చిన్న విరామం తర్వాత మహేష్ మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చాడు. దీంతో సినిమా స్టార్ట్ అవుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మరో అడ్డంకి సిద్దంగా ఉంది.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు తమ సినిమాల షూటింగ్స్ ఆపేశారు. ఇండస్ట్రీలో సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ గిల్డ్ లో కీలక సభ్యుడు నిర్మాత రాధాకృష్ణ కూడా. సో.. మహేష్ ఇప్పుడు రెడీగా ఉన్నప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేయలేని పరిస్థితి. దీంతో అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు, నాగవంశీ, ప్రమోద్, దామోదర ప్రసాద్ లాంటి నిర్మాతలు ఎగతెగని చర్చలు జరుపుతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించాలనే అంశంపై వీళ్లు చర్చలు సాగిస్తున్నారు. తారల రెమ్యూనరేషన్ సంగతి పక్కనపెట్టి, ప్రస్తుతం బడ్జెట్ కంట్రోల్ పైనే దృష్టి పెట్టారు. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే తప్ప... మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చే పరిస్థితి లేదు.

First Published:  6 Aug 2022 8:16 AM GMT
Next Story