Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr Polishetty | మహేష్-రవితేజ ఏమన్నారంటే...?

Miss Shetty Mr Polishetty - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మహేష్ బాబు, రవితేజ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

Miss Shetty Mr Polishetty | మహేష్-రవితేజ ఏమన్నారంటే...?
X

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సినిమాను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ మారుతి, వంశీ పైడిపల్లి, స్టార్ హీరోయిన్ సమంత మెచ్చుకున్నారు. తాజాగా మహేశ్ బాబు, రవితేజ ఈ లిస్ట్ లో చేరారు.

మహేశ్ బాబు స్పందిస్తూ... ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను మా ఫ్యామిలీతో కలిసి ఆద్యంతం ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనుష్క ఎప్పటిలాగే బ్రిలియంట్ గా నటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పి.మహేశ్ బాబు, యూవీ క్రియేషన్స్, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్" అని ట్వీట్ చేశాడు.

రవితేజ ట్వీట్ చేస్తూ - "సినిమాను చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. నవీన్ పొలిశెట్టి మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని కామెడీ టైమింగ్ గొప్పగా అనిపించింది. అనుష్క ఎప్పటిలాగే అలరించింది." అని మెచ్చుకున్నాడు.

మహేశ్ బాబు, రవితేజ స్పందనపై హీరో నవీన్ పోలిశెట్టి సంతోషం వ్యక్తం చేశాడు. ఇద్దరికీ విడివిడిగా కృతజ్ఞతలు తెలిపాడు.

యూఎస్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వన్ మిలియన్ మార్క్ అందుకుంది.

First Published:  10 Sep 2023 4:39 PM GMT
Next Story