Telugu Global
Cinema & Entertainment

Mahesh-Thaman: తమన్ కు మహేష్ ఇచ్చిన ఆఫర్ ఇది

Mahesh open offer to thaman - మహేష్ తనకు ఇచ్చిన తొలి ఆఫర్ ను గుర్తు చేసుకున్నాడు తమన్.

Mahesh Babu
X

Mahesh Babu

టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తమన్. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. మహేష్ కోసం తను కంపోజ్ చేసిన 2 పాటలు, తనకు మహేష్ నుంచి మరో ఆఫర్ వచ్చేలా చేశాయని వెల్లడించాడు.


అప్పుడప్పుడే కెరీర్ లో స్థిరపడుతున్న టైమ్ లో శ్రీనువైట్ల నుంచి తమన్ కు పిలుపొచ్చింది. దూకుడు సినిమా కోసం సంగీత దర్శకుడ్ని చూస్తున్నామని, మహేష్ కోసం 2 పాటలు ఇవ్వమని అడిగాడట వైట్ల. మహేష్ కు ఆ సాంగ్స్ నచ్చితే మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకుంటామని, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తామని క్లియర్ గా చెప్పేశాడు.


మహేష్ కోసం 2 రోజులు కష్టపడి 2 సాంగ్స్ కంపోజ్ చేశాడు తమన్. ఆ రెండు పాటలు మహేష్ కు నచ్చడం, దూకుడు సినిమాకు సంగీత దర్శకుడిగా మారిపోవడం చకచకా జరిగిపోయాయి.


అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఆ రెండు పాటలు లైక్ చేసిన మహేష్.. తన నెక్ట్స్ సినిమా బిజినెస్ మేన్ కు కూడా తమన్ నే తీసుకున్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే, మహేష్ బ్రేక్ మధ్యలో పిలిచి మరీ తనకు ఈ విషయం చెప్పేసరికి కళ్లలోంచి ఆనందభాష్పాలు వచ్చాయన్నాడు తమన్.

First Published:  3 Feb 2023 10:46 AM GMT
Next Story