Telugu Global
Cinema & Entertainment

మరో 3 రోజులు ఆలస్యంగా మహేష్ మూవీ

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి రావాలి మహేష్-త్రివిక్రమ్ సినిమా. కానీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. కారణం ఏంటంటే..

మరో 3 రోజులు ఆలస్యంగా మహేష్ మూవీ
X

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి రావాలి మహేష్ మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం ఇవాళ్టి నంచి మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ఎప్పట్లానే ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో మొదలు కావాల్సిన ఫస్ట్ షెడ్యూల్ ను, సోమవారం నుంచి స్టార్ట్ చేస్తారు.

మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేశాడు. ఓపెన్ ఎయిర్ లో చేయాల్సిన యాక్షన్ సీక్వెన్స్ అది. దాని కోసం రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. అయితే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ప్రకటించింది.

ఓపెన్ ఎయిర్ లో చేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్ కు వర్షం అడ్డంకిగా మారుతుంది. షూటింగ్ స్టార్ట్ చేసి, వృధా ఖర్చు చేసే కంటే, 3 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టడం మంచిదని భావించి, సోమవారానికి ఫస్ట్ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేశారు.

హారిక-హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే పూజా హెగ్డే, ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  8 Sep 2022 2:54 AM GMT
Next Story