Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu | రాజమౌళి కోసం ప్రిపేర్ అవ్వడం లేదు

Mahesh Babu - రాజమౌళి సినిమాపై మరోసారి స్పందించాడు మహేష్. అతడి సినిమా పనులు ఇంకా మొదలుపెట్టలేదని స్పష్టం చేశాడు

Mahesh Babu | రాజమౌళి కోసం ప్రిపేర్ అవ్వడం లేదు
X

రీసెంట్ గా మహేష్ ఏం చేసినా, అది రాజమౌళి సినిమా కోసమనే చర్చ మొదలౌతోంది. రీసెంట్ గా జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫొటోల్ని మహేష్ బాబు పోస్ట్ చేస్తున్నాడు. అవి బయటకొచ్చిన ప్రతిసారి రాజమౌళితో చేయాల్సిన సినిమా కోసం మహేష్ ప్రిపేర్ అవుతున్నాడంటూ కథనాలు వస్తున్నాయి.

ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం తను ప్రివేర్ అవ్వడం లేదని, క్యాజువల్ గా జిమ్ చేస్తున్న ఫొటోల్ని మాత్రమే రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

"నేను రోజూ వర్కవుట్ చేస్తాను. అప్పుడప్పుడు ఫొటోలు పెడుతుంటాను. చాలా ఏళ్లుగా జిమ్ చేస్తున్నాను. రాజమౌళి సినిమా వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ సినిమా కోసం వర్కవుట్ స్టార్ట్ చేసినప్పుడు కచ్చితంగా ఫొటో పెడతాను."

ఇలా తన జిమ్ ఫొటోలపై వస్తున్న వార్తల్ని ఖండించాడు మహేష్. ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాపై వస్తున్న ఊహాగానాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. గుంటూరుకారం సినిమా వచ్చే ఏడాది దసరాకు కచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు.

First Published:  20 Aug 2023 4:22 PM GMT
Next Story