Telugu Global
Cinema & Entertainment

Guntur Karam | గుంటూరు కారం మూవీ అప్ డేట్స్

Mahesh Babu's Guntur Karam - మహేష్, త్రివిక్రమ్ కొత్త సినిమా గుంటూరుకారం. ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్.

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
X

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడుతున్నాయి.

ప్రస్తుతం కూడా సినిమా షూట్ నడవడం లేదు. మహేష్ విదేశాల్లో ఉన్నాడు. త్రివిక్రమ్, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 20వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మ్యూజిక్ విషయంలో క్లారిటీ వచ్చింది.

గుంటూరుకారం సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో 5 సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ ఉంటాయట. వీటికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా నడుస్తున్నాయి. 20వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం 3 గంటల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించి, ఆ తర్వాత షూట్ కోసం సెట్స్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇక మరో అప్ డేట్ ఏంటంటే.. ఈ నెలలో మహేష్ పుట్టినరోజు ఉంది. బర్త్ డే కానుకగా ఆగస్ట్ 9న గుంటూరుకారం నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎఁదుకంటే, సినిమా విడుదలకు చాలా టైమ్ ఉంది. ఇంత త్వరగా ఓ సాంగ్ విడుదల చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉంది యూనిట్. మరో 2 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

First Published:  3 Aug 2023 3:08 AM GMT
Next Story