Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | ఇంకా ఓ పాట మిగిలే ఉంది

Guntur Kaaram - మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట సినిమాలో లేదు.

Guntur Karam | అమెరికాలో కుర్చీ మడతపెట్టి...
X

మహేష్ హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించి అంతా ముగిసిపోయిందని అంతా అనుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అలా భావించడం లేదు. గుంటూరుకారం సినిమా నుంచి మినిమం గ్యాప్స్ లో ఏదో ఒక స్టఫ్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.


తాజాగా తమన్ మరో ప్రకటన చేశాడు. ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. నిజంగా ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే, సినిమా విడుదలకు ముందు లిరికల్ వీడియోస్ విడుదల చేస్తారు. గుంటూరుకారం సినిమాకు సంబంధించి మాత్రం మూవీ థియేటర్లలోకి వచ్చి, వెళ్లిపోయిన తర్వాత లిరికల్ సాంగ్ విడుదల చేస్తున్నారు.


సినిమాకు సంబంధించి ఇది ఏడో పాట. నిజానికి ఈ సాంగ్ సినిమాలో లేదు, సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయలేదు. అందుకే ఇలా అంతా అయిపోయిన తర్వాత సాంగ్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. పైగా ఇది తమన్ కు, మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన సాంగ్ అంట.


థియేటర్లలోకి వచ్చి, ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అయిన తర్వాత సినిమాకు ఈ హైప్ ఇవ్వడం ఏంటో.. మేకర్స్ కే తెలియాలి. మహేష్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

First Published:  13 March 2024 4:15 PM GMT
Next Story