Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu - మహేష్-త్రివిక్రమ్ మూవీ నెక్ట్స్ అప్ డేట్ ఎప్పుడు?

Mahesh Babu, trivikram movie - కృష్ణ జయంతి కి మహేశ్ త్రివిక్రమ్ మూవీ తదుపరి అప్డేట్ రాబోతోంది.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఓ అప్ డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ ను ముందుగా విడుదల చేశారు. సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది.


అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి? హీరోయిన్ లుక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇలాంటి చాలా అనుమానాలు ఫ్యాన్స్ కు ఉన్నాయి. అందుకే ఈసారి యూనిట్ కాస్త ముందుగానే మేల్కొంది. సోషల్ మీడియాలో సినిమాపై లేనిపోని ట్రోలింగ్ ను ఎదుర్కొనేందుకు, తదుపతి అప్ డేట్ ఎప్పుడనే విషయాన్ని కూడా వెల్లడించింది.


మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి ఫస్ట్ లుక్ మాత్రమే అప్ డేట్. ఇక రెండో అప్ డేట్ ను మే నెలలో కృష్ణ జయంతి సందర్భంగా వెల్లడిస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈలోగా అప్ డేట్ ఇవ్వమని గోల చేయొద్దంటూ పరోక్షంగా వెల్లడించారు.


కృష్ణ ప్రతి పుట్టినరోజుకు తన సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడం మహేష్ కు అలవాటు. అయితే ఈసారి కృష్ణ భౌతికంగా మన మధ్య లేరు. అయినప్పటికీ ఆయన జయంతికి తన సినిమా అప్ డేట్ ఇవ్వాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. వీలైతే అప్పుడు టైటిల్ పోస్టర్ వచ్చే అవకాశం ఉంది.

First Published:  28 March 2023 9:50 AM GMT
Next Story