Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu- మహేష్ సినిమాకు భారీ ఆఫర్

Mahesh-Trivikram Movie - ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఇంకా సెట్స్ పై ఉన్న ఈ సినిమాకి క్రేజీ ఆఫర్ వచ్చింది.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఖలేజా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని వస్తున్న ఈ కాంబినేషన్‌పై ట్రేడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


గతంలో త్రివిక్రమ్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇది ఓటీటీలో కూడా భారీ విజయాన్ని సాధించింది. దీంతో మొదటి షెడ్యూల్ కే ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.


ఈ సినిమాకు కళ్లుచెదిరే ఆఫర్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఆ ఆఫర్ చూసి స్వయంగా నిర్మాతలు కూడా ఆశ్చర్యపోవడం విశేషం. అవును.. మహేష్-త్రివిక్రమ్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ సంస్థ 80 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. సౌత్ లాంగ్వేజెస్ అన్నింటికీ కలిపి ఈ ఆఫర్ ఇచ్చింది సదరు సంస్థ.


నిజానికి ఓటీటీ స్ట్రీమింగ్ కింద ఇంత మొత్తాన్ని నిర్మాతలు ఆశించలేదు. వాళ్లు డిజిటల్, శాటిలైట్ కలిపి వంద కోట్లు ఆశిస్తే.. ఒక్క డిజిటల్ నుంచే 80 కోట్ల డీల్ లాక్ అయింది. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద ఓటీటీ ఒప్పందం ఇది.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా, శ్రీలీల సెకెండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

First Published:  31 Jan 2023 11:42 AM GMT
Next Story