Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu | మహేష్ కెరీర్ ను మార్చిన ఆ 3 సినిమాలు

Mahesh Babu - మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. కానీ అతడి కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాలేంటి?

Mahesh Babu | మహేష్ కెరీర్ ను మార్చిన ఆ 3 సినిమాలు
X

ప్రతి హీరో కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాలు కొన్ని ఉంటాయి. హీరో మహేష్ బాబు కెరీర్ లో కూడా అలాంటి సినిమాలున్నాయి. ఫ్యాన్స్ చాలా సినిమాల గురించి మాట్లాడుతుంటారు. ఇంతకీ మహేష్ మనసులో ఉన్న సినిమాలేంటి? ఒకటి కాదు, రెండు కాదు, మహేష్ మనసులో 3 సినిమాలున్నాయి. అవి తన కెరీర్ ను మలుపుతిప్పాయంటున్నాడు ఈ హీరో.

అవే మురారి, పోకిరి, శ్రీమంతుడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా తనకు తొలి బ్రేక్ గా చెప్పుకొచ్చాడు మహేష్. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన పోకిరి సినిమాను తన కెరీర్ లో గేమ్ ఛేంజర్ గా చెప్పుకొచ్చాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చేసిన శ్రీమంతుడు సినిమాతో తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందంటున్నాడు.

ఈ 3 సినిమాలు తన కెరీర్ గతిని మార్చేశాయంటున్నాడు మహేష్. నిజానికి ఇవే కాకుండా ఒక్కడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి ఎన్నో హిట్స్ ఉన్నాయి మహేష్ కెరీర్ లో. కానీ ఆ సినిమాల కంటే, ఈ 3 సినిమాలే తన కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.

త్వరలోనే రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ హీరో. ఆ సినిమాలో 8 గెటప్స్ లో మహేష్ కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.

First Published:  6 March 2024 5:20 PM GMT
Next Story