Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: ఇకపై గ్యాప్ ఇవ్వడానికి వీల్లేదంట!

Mahesh Babu no gap - త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇకపై ఈ మూవీకి గ్యాప్స్ ఇవ్వడంట. దీనికి ఓ రీజన్ ఉంది

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

మహేష్ బాబుతో సినిమా అంటేనే గ్యాప్స్ వ్యవహారం. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో, ఎప్పుడు విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటాడో ఎవ్వరూ చెప్పలేరు. మధ్యలో యాడ్స్ షూటింగ్స్ అదనం. దీంతో మహేష్ తో సినిమా అంటే ఆ షూటింగ్ పడుతూలేస్తూ సాగుతుంటుంది. అందుకే ఏడాదికి ఒక సినిమా వస్తే కష్టం.


అయితే త్రివిక్రమ్ సినిమా కోసం మాత్రం మహేష్ రూటు మార్చాడు. వరుసగా కాల్షీట్లు ఇచ్చాడు. ఒక షెడ్యూల్ అయిన వెంటనే, మరో షెడ్యూల్ మొదలుపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లేట్ అవుతోంది. మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇవ్వడానికి ఇదొక కారణమైతే, మరో ముఖ్యకారణం కూడా ఉంది.


మహేష్-త్రివిక్రమ్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఎగ్రిమెంట్ లో రిలీజ్ డేట్ పై ఓ కండిషన్ పెట్టారట. ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయకపోతే పేమెంట్ లో కటింగ్ తప్పదు.


మహేష్ ఇలా శరవేగంగా షూటింగ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  7 Feb 2023 11:01 AM GMT
Next Story