Telugu Global
Cinema & Entertainment

ఏడాది ఒప్పందం.. 3 షోలు.. రూ. 9 కోట్లు?

జీ తెలుగులో మరోసారి బిగ్ డీల్ కుదుర్చున్నాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన కార్యక్రమం రేపు టెలికాస్ట్ అవుతుంది. ఇంతకీ ఈ డీల్ విలువ ఎంతో తెలుసా?

ఏడాది ఒప్పందం.. 3 షోలు.. రూ. 9 కోట్లు?
X

ఉన్నట్టుండి సడెన్ గా జీ తెలుగు టీవీ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యాడు మహేష్ బాబు. జీ తెలుగులో వస్తున్న డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చాడు. తనతో పాటు తన కూతుర్ని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ కార్యక్రమానికి జడ్జీలుగా కూడా వ్యవహరించారు. ఆ కార్యక్రమం రేపు ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించి సదరు ఛానెల్ ప్రచారాన్ని దంచికొడుతోంది.

అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇలా కొన్ని కార్యక్రమాల్ని ప్రచారం చేసేందుకు మహేష్ బాబు, జీ తెలుగు నుంచి ఏకంగా 9 కోట్ల రూపాయలు అందుకున్నాడట. కీలకమైన 3 కార్యక్రమాలు, 2 సీరియల్స్ లో కనిపించడంతో పాటు.. ఈ ఏడు జీ తెలుగు నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి కూడా మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నాయి. ఈ డీల్ కింద మహేష్ బాబుకు 9 కోట్ల రూపాయలు వచ్చినట్టు అనధికారిక సమాచారం.

నిజానికి జీ తెలుగులో మహేష్ ఇలా కనిపించడం కొత్తేంకాదు. గతంలో ఓ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చేందుకు మహేష్ ఇలానే జీ తెలుగు నుంచి భారీ పారితోషికం అందుకున్నాడు. అప్పట్లో ఆ కార్యక్రమం రద్దయింది. దాంతో జీ తెలుగు సీరియల్స్ ప్రచారానికి మహేష్ ను ఉపయోగించుకుంది.

ఆ అనుభవంతో ఈసారి ఏకంగా మహేష్ తో భారీ డీల్ సెట్ చేసుకుంది జీ తెలుగు. సినీతారలతో సదరు ఛానెల్ ఒప్పందాలు చేసుకోవడం కొత్తేంకాదు. మొన్నటివరకు ఈ ఛానెల్ కు కృతి శెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది.

First Published:  3 Sep 2022 10:31 AM GMT
Next Story