Telugu Global
Cinema & Entertainment

Writer Padmabhushan - మహేష్ మెచ్చిన చిత్రం

Mahesh Writer Padmabhushan - రైటర్ పద్మ భూషణ్ మూవీని చూశాడు మహేష్. యూనిట్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

Writer Padmabhushan - మహేష్ మెచ్చిన చిత్రం
X

'రైటర్ పద్మభూషణ్‌’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాను కంప్లీట్ గా సినిమాను ఎంజాయ్ చేశానని చెప్పారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.


“రైటర్ పద్మభూషణ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది. ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఘనవిజయం సాధించిన శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ తో పాటు టీమ్ అందరికీ అభినందనలు’’


ఇలా రైటర్ పద్మభూషణ్ సినిమాను మెచ్చుకున్నాడు మహేష్. ఈ సందర్భంగా యూనిట్ లో కీలక సభ్యులంతా కలిసి మహేష్ ను కలిశారు. వాళ్లతో మహేష్ దిగిన ఫొటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైటర్ పద్మభూషణ్ సినిమా చూసిన తర్వాత ఇలా అందరితో కలిసి ఫొటో దిగాడు మహేష్.


చాయ్ బిస్కెట్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందర్నీ ఆకట్టుకుంది. తల్లికొడుకు మధ్య అనుబంధాన్ని కొత్త డైమన్షన్ లో చూపించారు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా హిట్టవ్వడం సినిమాకు ప్లస్ అయింది.

First Published:  6 Feb 2023 11:05 AM GMT
Next Story