Telugu Global
Cinema & Entertainment

సెట్స్ పైకొచ్చిన మహావీరుడు

శివకార్తికేయన్ కొత్త సినిమా మహావీరుడు. డైరక్టర్ శంకర్ చేతుల మీదుగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది.

సెట్స్ పైకొచ్చిన మహావీరుడు
X

శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మహావీరుడు'. డైరక్టర్ శంకర్ కూతురు, అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించిన ఈ సినిమా టైటిల్‌ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఆల్రెడీ తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా వస్తోంది. ఇప్పుడీ కొత్త సినిమా మహావీరుడు కూడా ద్విభాషా చిత్రంగానే తెరకెక్కుతోంది.

First Published:  6 Aug 2022 8:04 AM GMT
Next Story