Telugu Global
Cinema & Entertainment

శివరాత్రి స్పెషల్‌.. థియేటర్లలో కొత్త సినిమాల సందడి

శుక్రవారం శివరాత్రి పండుగ సెలవు కావడంతో బాక్సాఫీసు వద్ద సందడి మరింత ఎక్కువగా ఉండనుంది.

శివరాత్రి స్పెషల్‌.. థియేటర్లలో కొత్త సినిమాల సందడి
X

మార్చి రెండో వారంలో ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథా చిత్రాలు సిద్ధమయ్యాయి. శుక్రవారం శివరాత్రి పండుగ సెలవు కావడంతో బాక్సాఫీసు వద్ద సందడి మరింత ఎక్కువగా ఉండనుంది.

పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా గోపీచంద్

గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ శివరాత్రి రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్లు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

అఘోరాగా విశ్వక్‌సేన్

విశ్వక్‌ సేన్‌ నటించిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ కూడా శివరాత్రి రోజునే రిలీజ్ అవుతోంది. విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి హీరోయిన్. స్పర్శ లేని సమస్యను ఎదుర్కుంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా స్టోరీ. దాదాపు ఆరేళ్లపాటు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు డైరెక్టర్ తెలిపాడు.

తెలుగులో "ప్రేమలు"

మళయాళం సూపర్ హిట్‌ మూవీ "ప్రేమలు". రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ. 85 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో దీన్ని తెలుగులో డబ్ చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు.

పాన్‌ ఇండియా మూవీగా "రికార్డ్ బ్రేక్"

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’. నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ కీలక పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల అవుతోంది.

చిన్న సినిమాల హవా

అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’. రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకుడు. హాస్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా కూడా మార్చి 8న విడుదల కానుంది. రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్‌ దర్శకుడు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది.

షైతాన్‌గా వస్తున్న అజయ్ దేవగణ్

అజయ్‌ దేవగణ్‌, ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘షైతాన్‌’. ఇది హిందీలో వస్తోంది. వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  4 March 2024 6:21 AM GMT
Next Story