Telugu Global
Cinema & Entertainment

Tillu Square: శ్రీలీల టూ మడోన్నా వయా అనుపమ పరమేశ్వరన్

Tillu Square: సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి ఇంకో హీరోయిన్ జంప్ అయింది, మరో హీరోయిన్ వచ్చి చేరింది.

Tillu Square: శ్రీలీల టూ మడోన్నా వయా అనుపమ పరమేశ్వరన్
X

ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న చిన్న సినిమాల లిస్టు లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది 'డీజే టిల్లు'. ఈ సినిమా రిలీజ్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ స్టార్ అయిపోయాడు. హీరోయిన్ గా నటించిన నేహా శెట్టికి మంచి క్రేజ్ వచ్చింది, వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.


ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. దీని పేరు టిల్లూ స్క్వేర్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే తాజాగా అనుపమ ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆమె ఎందుకు తప్పుకుందనే కారణాలు బయటకు రాలేదు.


అనుపమ తప్పుకుందనే న్యూస్ బయటకొచ్చిన వెంటనే, ఆ స్థానంలోకి మడొన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారనే టాక్ కూడా వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం, మడొన్నా ఈ సినిమాలో దాదాపు ఫిక్స్ అయింది.


అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వీళ్లిద్దరి కంటే ముందే హీరోయిన్ శ్రీలీల ఇందులో నటించింది. టిల్లూ స్క్వేర్ కోసం ముందుగా శ్రీలీలను తీసుకున్నారు. ఆమె 5 రోజులు షూటింగ్ కూడా చేసింది, ఆ వెంటనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అలా టిల్లూ స్క్వేర్ ప్రాజెక్టులో హీరోయిన్లు వరుసపెట్టి మారిపోతున్నారు.

First Published:  29 Nov 2022 12:48 PM GMT
Next Story