Telugu Global
Cinema & Entertainment

MAD Movie | మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

MAD Movie - సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న యూత్ మూవీ మ్యాడ్. ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేశారు.

MAD Movie | మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'. ఈ సినిమాను రక్షా బంధన్ రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులోని అడల్ట్ జోకుల్ని వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అడల్ట్ కామెడీతో సాగిన ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ తో వెంటనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల్లోనే సినిమా రిలీజ్.

మ్యాడ్ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. నాగవంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్ పై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ అడల్ట్ కామెడీ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు.

భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది ఈ సినిమా.

First Published:  2 Sep 2023 8:40 AM GMT
Next Story