Telugu Global
Cinema & Entertainment

MAD Movie | సితార నుంచి ఓ 'పిచ్చి' సినిమా

MAD Movie - సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ఊహించని సినిమా వస్తోంది. ఈ మూవీ పేరు మ్యాడ్.

MAD Movie | సితార నుంచి ఓ పిచ్చి సినిమా
X

హారిక-హాసిని.. టాలీవుడ్ పెద్ద బ్యానర్లలో ఒకటి. ఇక ఇదే సంస్థకు చెందిన మరో బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇది కూడా ఆషామాషీ బ్యానర్ కాదు. మంచి సినిమాల్ని టాలీవుడ్ కు అందించిన సంస్థ. ఇలాంటి బ్యానర్ నుంచి ఓ సి-గ్రేడ్ సినిమాను ఆశించగలమా? ఓ స్థాయి ఉన్న ఈ సంస్థ నుంచి చీప్ సినిమాలు రావనే అనుకుంటారు ఎవరైనా. కానీ వచ్చింది.

ఈరోజు మ్యాడ్ అనే సినిమా టీజర్ వచ్చింది. టీజర్ మొత్తం అసభ్యత కొట్టొచ్చినట్టు కనిపించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ఇలాంటి సినిమా ఏంటంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా ఉంది ఈ టీజర్. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది.

ఈ చీప్ సినిమాతో చినబాబు కూతురు, నాగవంశీ సోదరి హారిక నిర్మాతగా పరిచయమౌతోంది. అంతేకాదు, త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఓ మహిళా నిర్మాతను పరిచయం చేస్తూ, ఓ సెమీ-అడల్ట్ చిత్రాన్ని అందిస్తున్నట్టుగా ఉంది.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది మ్యాడ్ మూవీ. ఇందులో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ అసభ్యంగా ఉన్నాయి. దీనికి నిర్మాతలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అనే పేరు పెట్టారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి నటిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకీ ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా.. మీ కోసమే ఈ లింక్..

First Published:  31 Aug 2023 2:22 PM GMT
Next Story