Telugu Global
Cinema & Entertainment

మాచర్ల నియోజకవర్గం.. ట్రయిలర్ ఎలా ఉందంటే!

నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం ట్రయిలర్ రిలీజైంది. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేశారు.

మాచర్ల నియోజకవర్గం.. ట్రయిలర్ ఎలా ఉందంటే!
X

హీరో నితిన్ కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. గుంటూరులోని బ్రాడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్‌ను, దర్శకుడు అనీల్ రావిపూడి చేతులమీదుగా లాంచ్ చేశారు.

2 నిమిషాల 50 సెకన్ల రన్ టైమ్ తో వచ్చిన ఈ ట్రయిలర్ లో ఇటు క్లాస్, అటు మాస్ ఎలిమెంట్స్ చూపించారు. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ పంచిన హాస్యంతో బ్యాలెన్స్ అయింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌ లోకి మారిపోయింది ట్రయిలర్.

విలన్ రాజప్ప గా సముద్రఖని ఎంట్రీ టెర్రిఫిక్ గా ఉంది. మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా కొనసాగుతుంటాడు. అయితే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ గా అది తన బాధ్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా ఉంది.

నితిన్ క్యాజువల్స్ లో క్లాస్ గా కనిపిస్తూనే, పవర్ ఫుల్ పంచ్ లతో మాస్ టచ్ ఇచ్చాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. "నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనులా యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా" అనే డైలాగ్ ట్రయిలర్ హైలెట్ గా నిలిచింది.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. తాజాగా జరిగిన ఈవెంట్ తో రిలీజ్ డేట్ ను మరోసారి కన్ ఫర్మ్ చేశారు.



First Published:  30 July 2022 3:33 PM GMT
Next Story