Telugu Global
Cinema & Entertainment

Lucifer | సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్

Lucifer - సూపర్ హిట్ లూసిఫర్ కు సీక్వెల్ రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాతో కేరళలో అడుగుపెట్టింది.

Lucifer | సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్
X

మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే కొత్తదనం. ఆ ఇండస్ట్రీ నుంచే ఎక్కువగా కొత్తకథలు వస్తుంటాయి. ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ హిట్ అవుతుంటాయి. మెథ‌డ్ యాక్టింగ్‌తో ఎంద‌రో టాలెంటెడ్ న‌టీన‌టుల‌ను అందిస్తోంది మల్లూవుడ్. ఇలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చి కంప్లీట్ యాక్ట‌ర్ ఇమేజ్‌ను సంపాదించుకున్న న‌టుడు మోహ‌న్ లాల్‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్దాల పైగా అనుభ‌వం, 350 సినిమాలు ఆయ‌న్ని తిరుగులేని హీరోగా నిల‌బెట్టాయి. ఆయ‌న న‌ట‌న‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసి ఇప్ప‌టికీ హ‌య్య‌స్ట్ పెయిడ్ యాక్ట‌ర్‌గా అక్క‌డ కొన‌సాగుతున్నారు.

అలాగే మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు. 2019లో ఈయ‌న డైరెక్ట్ చేసిన సినిమా లూసిఫ‌ర్ ఎంత‌టి ఘ‌న విజయాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

దీనికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ చిత్రం మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నుంది. ఆంటోని పెరంబ‌వూర్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాతో కేరళ చిత్రసీమలో అడుగుపెడుతోంది లైకా. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పార్ట్-2 హిట్టయితే, దాన్ని కూడా చిరంజీవి రీమేక్ చేసే ఛాన్స్ ఉంది.




First Published:  30 Sep 2023 5:46 PM GMT
Next Story