Telugu Global
Cinema & Entertainment

Mission:Chapter 1 - లైకా చేతికి అరుణ్ విజయ్ సినిమా

Mission Chapter 1 - అరుణ్ విజయ్ తాజా చిత్రం మిషన్ ఛాప్టర్-1.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేయబోతోంది.

Mission:Chapter 1 - లైకా చేతికి అరుణ్ విజయ్ సినిమా
X

భారీ చిత్రాలు నిర్మించడమే కాదు, మంచి సినిమా కనిపిస్తే దాన్ని భారీ ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా తెలుసు లైకా ప్రొడక్షన్స్ కంపెనీకి. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-2, ఇండియన్-2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ.. అదే టైమ్ లో ఓ సినిమాను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. అదే ‘మిషన్: చాప్ట‌ర్ 1’.

కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావించింది లైకా టీమ్‌. అంతేకాకుండా, దీనికి భాషాబేధాలు లేవనే విషయాన్ని కూడా గుర్తించింది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని 4 భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు నిర్మాత‌లు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత.. 2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

జైలును రక్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఎమీ క‌నిపించ‌నుంది. ఈ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీ ఖ‌ర్చుతో ఓ జైలు సెట్ వేశారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  4 April 2023 7:22 AM GMT
Next Story