Telugu Global
Cinema & Entertainment

లక్కీ లక్ష్మణ్ టైటిల్ సాంగ్ ఇదే

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తున్న సినిమా లక్కీ లక్ష్మణ్. ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజైంది.

లక్కీ లక్ష్మణ్ టైటిల్ సాంగ్ ఇదే
X

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్‌'. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా ఇది. అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని 'అదృష్టం హలో అంది రో.. చందమామ' టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. మజిలీ, ఖుషి, టక్ జగదీశ్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ ఈ సాంగ్ విడుదల చేశాడు.

హీరో రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు "అదృష్టం హలో అంది రో చందమామ" అంటూ సాగే లిరిక్స్ రిచ్ కిడ్ 'హవా'లో సాగుతున్న ఈ పాటకు సోహైల్ డాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చెప్పవచ్చు.

ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాసిన ఈ గీతాన్ని సింగర్.. రామ్ మిరియాల పాడాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "లక్కీ లక్ష్మణ్" సినిమా కచ్చితంగా సోహైల్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటున్నారు యూనిట్ జనాలు.



First Published:  4 Aug 2022 4:06 AM GMT
Next Story