Telugu Global
Cinema & Entertainment

Lucky Lakshman OTT: ఒకేసారి 2 ఓటీటీల్లోకి చిన్న సినిమా

Lucky Lakshman OTT: లక్కీ లక్ష్మణ్ మూవీ OTT లోకి వచ్చింది. ఒకేసారి 2 OTT ల్లోకి వచ్చింది ఈ సినిమా.

Lucky Lakshman OTT: ఒకేసారి 2 ఓటీటీల్లోకి చిన్న సినిమా
X

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్‌లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే ఇప్పుడీ సినిమా ఆడియెన్స్‌కు మ‌రింత చేరువ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ‌లు అమెజాన్ ప్రైమ్‌, ఆహాల్లో మ‌హా శివ రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు.

దిగువ మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడు ల‌క్ష్మ‌ణ్ (స‌య్య‌ద్ సోహైల్‌). తండ్రి (దేవీ ప్ర‌సాద్‌) ఆర్థిక ప‌రిస్థితి అస్స‌లు బాగోదు. త‌ను ఏది అడిగినా కొనివ్వ‌లేడు. దీంతో ల‌క్ష్మ‌ణ్‌లో తెలియ‌ని అసంతృప్తి ఉంటుంది. ఇంజ‌నీరింగ్ చ‌దివే స‌మ‌యంలో శ్రియ (మోక్ష‌)తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి ల‌క్ష్మ‌ణ్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. ల‌క్ష్మ‌ణ్ ఆర్థిక ప‌రిస్థితి తెలిసిన శ్రేయ అత‌నికి సాయం చేస్తుంటుంది.

స్నేహితుల సాయంతో సొంతంగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్ అందులో బాగా డ‌బ్బులు సంపాదిస్తాడు. డబ్బులున్నాయ‌నే పొగ‌రుతో ప్రేమ‌ను కాద‌నుకుంటాడు. తల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోడు. అయితే అనుకోకుండా ఓరోజు తండ్రి స్నేహితుడు క‌న‌ప‌డి.. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని, త‌న కోసం చేసిన త్యాగాన్ని తెలుసుకుని షాక‌వుతాడు. వారికి ద‌గ్గ‌ర‌వుతాడు. హీరోకి, త‌న తండ్రికి ఉన్న ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. తండ్రి కొడుకు కోసం చేసే త్యాగాల‌ను గుర్తుకు చేసి హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తాయి.

తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఈ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది యూనిట్. సాధారణంగా పెద్ద సినిమాలు ఇలా రెండు ఓటీటీల్లో ఒకేసారి విడుదవుతుంటాయి. ఓ చిన్న సినిమా ఇలా 2 ఓటీటీ సంస్థల్లో రావడం విశేషమే.

First Published:  19 Feb 2023 3:53 PM GMT
Next Story