Telugu Global
Cinema & Entertainment

Love Today OTT Release Date: కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి

Love Today OTT Release Date Telugu: తెలుగులో ఘన విజయం సాధించింది లవ్ టుడే మూవీ. కుర్రాళ్లు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కాస్త లేట్ అయింది.

Love Today OTT Release Date: కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి
X

Love Today OTT Release Date: కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి

అంతా ఊహించినట్టే జరిగింది. టాలీవుడ్ లో మరో డబ్బింగ్ సినిమా సూపర్ హిట్టయింది. కాంతార, విక్రమ్, కేజీఎఫ్2 సినిమాల టైపులో లవ్ టుడే అనే చిన్న సినిమా కూడా టాలీవుడ్ లో బంపర్ హిట్ అందుకుంది. అదే రోజు విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాను కూడా వెనక్కి నెట్టి లవ్ టుడే సక్సెస్ సాధించింది.

తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఇప్పుడీ మూవీ ఓటీటీ విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే క్రిస్మస్ కు లవ్ టుడే సినిమా ఓటీటీలోకి వస్తుంది.

నిజానికి చాన్నాళ్ల కిందటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఆ తర్వాత తమిళనాట సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద హిట్టయింది. సో.. ఇదే ఊపులో ఓటీటీలో లవ్ టుడేను పెడితే ఆ కంపెనీకి మంచి లాభాలొస్తాయి. అయితే తెలుగులో ఈ సినిమా రన్ ముగుస్తుంది.

అలా అని తమిళ వెర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే, ఇప్పటికే చాలా రోజులైపోయింది. అందుకే మధ్యేమార్గం అనుసరించారు. ముందుగా డిసెంబర్ మొదటి వారంలో తమిళ వెర్షన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 3 వారాలకు తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది.

Next Story