Telugu Global
Cinema & Entertainment

Love Me | కొత్త విడుదల తేదీ

Love Me - ఆశిష్ రెండో సినిమా లవ్ మీ. ఈ సినిమాకు విడుదల తేదీ మార్చారు.

Love Me | కొత్త విడుదల తేదీ
X

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక.

ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ చేయబోతున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో తేదీ మార్చారు. మే 25న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో ఈ సినిమా రాబోతోందని చెబుతున్నారు మేకర్స్. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

First Published:  24 April 2024 5:13 PM GMT
Next Story