Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi | చిరంజీవి కోసం హీరోయిన్లు క్యూ

Chiranjeevi - బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు చిరంజీవి. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను ప్రయత్నిస్తున్నారు.

Chiranjeevi | చిరంజీవి కోసం హీరోయిన్లు క్యూ
X

భోళా శంకర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చూశారు చిరంజీవి. థియేటర్లలోకి వచ్చి వారం కూడా పూర్తవ్వకుండానే ఈ సినిమా తన రన్ పూర్తి చేసుకుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చాలా డల్ గా, పాత చింతకాయపచ్చడి టైపులో తీశాడు. అలాగే, చిరంజీవి కూడా భారీగా ట్రోల్స్‌కు గురయ్యారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి పెద్దగా కనిపించలేదు. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.

మళ్లీ ఇన్నాళ్లకు బింబిసార ఫేమ్ వశిష్ఠతో కలిసి కనిపిస్తున్నారు చిరంజీవి. ఈయన దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి, ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.

కథ ప్రకారం ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది. ఐశ్వర్య రాయ్, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లను ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రల కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ ఫాంటసీ డ్రామాలో ముగ్గురు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అనుష్క శెట్టిని తప్ప మరెవరినీ సంప్రదించలేదన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. మెయిన్ లీడ్ పాత్రకు అనుష్క మాత్రమే సరిపోతుందని చిరంజీవి భావించారట. అందుకే ఆమెను సంప్రదించమని సూచించారట. యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ఎలాగూ అనుష్క క్లోజ్ కాబట్టి, హీరోయిన్ దాదాపు లాక్ అయినట్టే. అనుష్క లాక్ అయిన తర్వాత, మిగతా హీరోయిన్లు ఎవరనే అంశాన్ని డిసైడ్ చేస్తారు.

First Published:  21 Sep 2023 12:07 PM GMT
Next Story