Telugu Global
Cinema & Entertainment

ఇంట్రెస్టింగ్ : లారెన్స్ తో లోకేష్ కనకరాజ్ మూవీ

ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఇందులో హీరోయిన్ గా నటించడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే.

ఇంట్రెస్టింగ్ : లారెన్స్ తో లోకేష్ కనకరాజ్ మూవీ
X

అటు తమిళనాట ఇటు తెలుగులో హర్రర్ చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించిన హీరో రాఘవ లారెన్స్. ముందు స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉండి ఆ తర్వాత హీరోగా మారిన లారెన్స్ వరుసగా హర్రర్ సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టాడు. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ తమిళ అగ్ర హీరో విజయ్‌తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్‌తో పనిచేయడానికి సౌత్‌కు చెందిన పలువురు అగ్ర హీరోలు ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్, కార్తీ సినిమాలు లైన్‌లో ఉండగా, తెలుగు అగ్ర హీరో రామ్ చరణ్‌తో కూడా లోకేష్ ఓ సినిమా చేయనున్నాడు.

ఇదిలా ఉండగా రాఘవ లారెన్స్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అగ్ర హీరోలు వరుస పెట్టి లైన్లో ఉన్న సమయంలో లారెన్స్ తో లోకేష్ సినిమా చేయడం ఏంటీ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే విషయం ఏంటంటే లోకేష్ - లారెన్స్ కాంబినేషన్లో సినిమా వస్తున్నప్పటికీ ఈ మూవీకి లోకేష్ దర్శకత్వం వహించడం లేదు. కేవలం కథ మాత్రమే అందిస్తున్నాడు. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఇందులో హీరోయిన్ గా నటించడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. నయనతార ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ క్యాల్ షీట్ల సమస్యతో తిరస్కరిస్తోంది. అంత బిజీగా ఉన్న నయనతార లారెన్స్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి -2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ కథ అందిస్తున్న మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


First Published:  3 Sep 2023 12:23 PM GMT
Next Story