Telugu Global
Cinema & Entertainment

Lokesh Kanagaraj | ప్రభాస్ తో సినిమా అలా ఉండదు

Lokesh Kanagaraj - ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ ఫర్మ్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం కూడా బయటపెట్టాడు.

Lokesh Kanagaraj | ప్రభాస్ తో సినిమా అలా ఉండదు
X

ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో తనదైన ప్రపంచం సృష్టించాడు లోకేష్ కనగరాజ్. ప్రేక్షకుల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులంతా లోకేష్ సినిమాలను ముద్దుగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్-ఎల్సీయూ అని పిలవడం మొదలుపెట్టారు. దీనికి ఓ కారణం కూడా ఉంది.

తను తీసే సినిమాల్లో ఒకటి దానితో ఒకటి ముడిపెడుతుంటాడు లోకేష్. అందుకే అతడి సినిమాలది ఓ ప్రత్యేకమైన యూనివర్స్. అయితే ప్రభాస్ తో చేయబోయే సినిమాకు మాత్రం ఈ యూనివర్స్ తో సంబంధం ఉండదని స్పష్టం చేశాడు లోకేష్.

2025లో ప్రభాస్, లోకేష్ కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమా కథపై స్పందించని లోకేష్, ప్రభాస్ తో చేయబోయే సినిమా మాత్రం తన యూనివర్స్ కు భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశాడు. భారతదేశం అంతటా, భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే కథను ప్రభాస్ కోసం సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపిన లోకేష్, ఆ పని ఇంకా మొదలుపెట్టలేదని చెబుతున్నాడు.

ప్రభాస్ కు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. అతడి సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంటుంది. కాబట్టి అలాంటి హీరోకు యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను రాసుకుంటానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. మొత్తమ్మీద ప్రభాస్ తో సినిమా ఉంటుందని ఈ స్టార్ డైరక్టర్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. కల్కి సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు మారుతి సినిమా కూడా నడుస్తోంది. అటు సలార్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాల్లో ఏదో ఒకటి కొలిక్కి వచ్చిన వెంటనే లోకేష్ కనగరాజ్ సినిమా స్టార్ట్ అవుతుంది.

First Published:  17 Oct 2023 5:03 PM GMT
Next Story