Telugu Global
Cinema & Entertainment

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీ టీజర్ రివ్యూ

సంతోష్ శోభన్ కొత్త సినిమా లైక్ షేర్ & సబ్ స్క్రైబ్. ఈ సినిమా టీజర్ ను హీరో నితిన్ లాంచ్ చేశాడు. టీజర్ ఎలా ఉందో చూద్దాం.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీ టీజర్ రివ్యూ
X

దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్‌ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. సంతోష్ సూపర్‌హిట్ 'ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే.

తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్‌ ను హీరో నితిన్ లాంచ్ చేశాడు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్‌ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను తన ప్రేమలో పడేయాలని చూస్తుంటాడు. ఇలా హిలేరియస్ గా సాగుతున్న టీజర్, కాసేపటికే క్రైమ్ యాంగిల్ తీసుకుంటుంది.

టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ చాలా బాగుంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్‌ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన ఈ టీజర్, సినిమాపై అంచనాల్ని పెంచింది.



First Published:  19 Sep 2022 1:24 PM GMT
Next Story