Telugu Global
Cinema & Entertainment

మాది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ

కామెడీ చిత్రంగా వస్తోంది లైక్-షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ. అయితే ఇందులో కామెడీతో పాటు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందంటోంది హీరోయిన్.

మాది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ
X

సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా లైక్-షేర్-సబ్ స్క్రైబ్. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. దానికి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లైక్-షేర్-సబ్ స్క్రైబ్ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటోంది ఇందులో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా.

"ఇది చాలా అడ్వంచర్ మూవీ. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. దీని కోసం 20 రోజులు అడవిలోనే ఉన్నాం. సిగ్నల్ కూడా లేదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని అడవిలోనే క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. మా సినిమాకు ఫారెస్ట్ కు చాలా లింక్ ఉంది."

ఇలా లైక్-షేర్-సబ్ స్క్రైబ్ సినిమాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉందనే విషయాన్ని బయటపెట్టింది ఫరియా. అంతేకాదు, ఈ సినిమాతో తన జీవితకాల కోరిక కూడా నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తను దేశం దాటలేదని, తొలిసారిగా ఈ సినిమా కోసం థాయ్ లాండ్ వెళ్లామని, అక్కడ ఓ పాట షూట్ చేశామని తెలిపింది

నవంబర్ 4న థియేటర్లలోకి వస్తోంది లైక్-షేర్-సబ్ స్క్రైబ్ మూవీ. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

First Published:  29 Oct 2022 12:00 PM GMT
Next Story