Telugu Global
Cinema & Entertainment

కీలకమైన శనివారం లైగర్ పరిస్థితేంటి?

లైగర్ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఆడుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన శనివారం, ఈ సినిమా రన్ ఎలా సాగింది..

కీలకమైన శనివారం లైగర్ పరిస్థితేంటి?
X

నిన్నటితో 3 రోజుల రన్ పూర్తి చేసుకుంది లైగర్ మూవీ. నెగెటివ్ టాక్ తో ఈ సినిమాకు రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతున్నాయి. నిన్నటికి నిన్న వీకెండ్ అయినప్పటికీ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి కోటి రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే విషయం తేలిపోయింది.

లైగర్ సినిమాకు మొదటి రోజైన గురువారం ఏకంగా 9 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక రెండో రోజు శుక్రవారం ఆ షేర్ కోటిన్నరకు పడిపోయింది. మూడో రోజైన శనివారం అది కేవలం కోటి రూపాయలకు పరిమితమైంది. ఆదివారం సంగతి పక్కనపెడితే, సోమవారం నుంచి ఈ సినిమా థియేటర్లలో రన్ అవ్వడం కష్టమని తేలిపోయింది.

నిన్నటి శనివారం వసూళ్ల విషయానికొస్తే.. లైగర్ సినిమాకు కేవలం లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చాయి. కీలకమైన నైజాం నుంచి కేవలం 36 లక్షల రూపాయలు మాత్రమే రాగా.. సీడెడ్ నుంచి 20 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి 16 లక్షలు మాత్రమే వచ్చాయి. అత్యల్పంగా వెస్ట్ నుంచి కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.

First Published:  28 Aug 2022 9:37 AM GMT
Next Story