Telugu Global
Cinema & Entertainment

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్.. విజయ్ కెరీర్ బెస్ట్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిన్న వరల్డ్ వైడ్ రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విజయ్.

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్.. విజయ్ కెరీర్ బెస్ట్
X

భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది లైగర్ సినిమా. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా కోసం ఉదయాన్నే 6 గంటల షోలు పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి.

లైగర్ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమాకు ఫస్ట్ డే 13 కోట్ల 45 లక్షల రూపాయల నెట్ వచ్చింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ఇది.

ఇంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు గరిష్టంగా తొలి రోజు 7 కోట్ల 50 లక్షల రూపాయలొచ్చాయి. ఇప్పుడా రికార్డ్ ను లైగర్ కొట్టేసింది. అటు పూరి జగన్నాధ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ ఈ సినిమానే. గతంలో పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఫస్ట్ డే 7 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అంతేకాదు, టైర్-2 హీరోస్ లో ఈ ఓపెనింగ్ ఓ రికార్డ్.

నైజాంలో ఈ సినిమా 25 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తే తొలి రోజే 4 కోట్ల 24 లక్షల రూపాయలొచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వీకెండ్ ఈ మూవీ గట్టిగా ఆడాలి. కానీ మొదటి రోజే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం కలవరపెడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం - 4.24 కోట్లు

సీడెడ్ - 1.32 కోట్లు

ఉత్తరాంధ్ర - 1.27 కోట్లు

ఈస్ట్ - 64 లక్షలు

వెస్ట్ - 39 లక్షలు

గుంటూరు - 83 లక్షలు

నెల్లూరు - 40 లక్షలు

కృష్ణా - 48 లక్షలు

First Published:  26 Aug 2022 12:06 PM GMT
Next Story