Telugu Global
Cinema & Entertainment

Leo Trailer | విజయ్-లోకేష్ మ్యాజిక్

Leo Trailer - విజయ్, లోకేష్ కనగరాజ్ కలిసి మరోసారి మేజిక్ చేయబోతున్నారు. తాజాగా లియో ట్రయిలర్ రిలీజైంది.

Leo Trailer | విజయ్-లోకేష్ మ్యాజిక్
X

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ 'లియో' కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ కు మంచి బజ్ వచ్చింది. 7 స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోహిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. "ఒక సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్ మీద చాలా మంది చనిపోయారు. హీ ఈజ్ నొటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా సింహం లా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ తిరిగి కాల్చాడు. పోలీస్ ఆఫీసర్ గన్ రీలోడ్ చేసే గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో ఉంది. అండ్ యూ హ్యావ్ ఏ క్లీన్ షాట్. ఏం చేస్తారు’’ అని విజయ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం టెర్రిఫిక్ అండ్ వైల్డ్ గా సాగింది.

ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్ టార్డినరిగా ఉన్నాయి. విజయ్ పవర్ ఫుల్ ప్రజెన్స్, మ్యాసివ్ యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. వైల్డ్ యాక్షన్ తో కట్టిపడేశాడు విజయ్. అలాగే సంజయ్ దత్, అర్జున్ పాత్రలు కూడా డెడ్లీగా ఉన్నాయి. త్రిష, పాప రూపంలో ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. లోకేష్ కనకరాజ్ తనదైన మార్క్ తో లియోని అవుట్ స్టాండింగ్ గా ప్రజెంట్ చేశాడు.

రాక్‌స్టార్ అనిరుధ్ నేపధ్య సంగీతం, ట్రయిలర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ఫిలోమిన్ రాజ్ ట్రైలర్ కట్ మెస్మరైజ్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. మొత్తానికి లియో ట్రైలర్ సినిమాపై మరింత భారీ అంచనాలని పెంచింది. అక్టోబర్ 19న లియో ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

ఈ సినిమాతో ఈ దసరాకు తను మరింత పోటీ ఇవ్వబోతున్నానని ట్రయిలర్ తో చెప్పకనే చెప్పాడు విజయ్. ఈ దసరాకు టాలీవుడ్ లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలున్నాయి. ఆ రెండు స్ట్రయిట్ సినిమాల మధ్యనే పోటీ ఉంటుందని, డబ్బింగ్ మూవీ లియో రేసులో ఉండదని చాలామంది భావించారు. కానీ లియో ట్రయిలర్ తో పోటీ మరింత రాజుకుంది. పైగా లోకేష్ కనగరాజ్ కు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కచ్చితంగా బాలకృష్ణ, రవితేజ సినిమాకు విజయ్ మూవీ నుంచి పోటీ ఎదురుకాబోతోంది.

First Published:  6 Oct 2023 1:30 AM GMT
Next Story