Telugu Global
Cinema & Entertainment

LEO Movie | మరో రికార్డ్ సృష్టించిన లియో

Leo Movie - లియో సినిమా 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ఈ ఘనత సాధించిన నాలుగో తమిళ చిత్రంగా నిలిచింది.

LEO Movie | మరో రికార్డ్ సృష్టించిన లియో
X

లియో 500 కోట్లను కొల్లగొట్టి, ఈ మైలురాయిని సాధించిన 4వ కోలీవుడ్ చిత్రంగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో దళపతి విజయ్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 19న విడుదలైన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందన నడుస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు, లియో చిత్రం 500 కోట్లకు చేరుకుంది. ఈ మైలురాయిని సాధించిన 4వ కోలీవుడ్ చిత్రంగా నిలిచింది.

మొదటి వారాంతం, దసరా పండుగ రోజులలో బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ని సాధించింది. అంతేకాదు, ఈ వీకెండ్ మరోసారి పెద్ద మొత్తంలో వసూలు చేయడానికి సిద్ధంగా ఉంది.

మొదటి వారంలో 460 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా జస్ట్ 2 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. ఈ క్లబ్ లో ఆల్రెడీ ఉన్న 2.O, పొన్నియిన్ సెల్వన్ - 1, జైలర్ సినిమాల సరసన చేరింది లియో.

ఈ సినిమా నెక్ట్స్ టార్గెట్ 600 కోట్లు. ఈ ఘనత సాధించిన సినిమా కోలీవుడ్ లో జైలర్ మాత్రమే. ఈ రికార్డ్ ను లియో బద్దలుకొడతాడా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ట్రేడ్ అంచనా ప్రకారం, 600 కోట్ల మార్క్ ను లియో అందుకోవడం కష్టం. మరో 10 రోజులు గట్టిగా ఆడితే తప్ప ఈ స్థాయి వసూళ్లు రావు. ప్రస్తుతం మార్కెట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు

First Published:  28 Oct 2023 5:11 PM GMT
Next Story