Telugu Global
Cinema & Entertainment

Rudrudu Movie: రుద్రుడు గ్లింప్స్.. లారెన్స్ ఉగ్రరూపం

Rudrudu Movie: రుద్రుడు సినిమా విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. కాకపోతే లారెన్స్ పుట్టినరోజు వచ్చింది. దీంతో సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Rudrudu Movie: రుద్రుడు గ్లింప్స్.. లారెన్స్ ఉగ్రరూపం
X

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాతలు సినిమా విడుదలకు సరైన స్లాట్‌ని ఎంచుకున్నారు. 2023లో ఏప్రిల్ 14న రుద్రుడు థియేటర్స్ లోకి వస్తున్నాడు.

రాఘవ లారెన్స్ బర్త్ డే కానుకగా 'రుద్రుడు' భారీ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. లారెన్స్ కంప్లీట్ ట్రాన్స్ ఫర్మేషన్ లో రగ్గడ్ లుక్ లో కనిపించాడు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్ సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తుంది.

యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం, వీడియోలో యాక్షన్ ని మరింత ఎలివేట్ చేసింది. కెమెరా పనితనం బాగుంది. లారెన్స్ నుంచి కోరుకునే అన్ని అంశాలు ఈ గ్లింప్స్ లో ఉన్నాయి.

ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సమ్మర్ లో ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.



First Published:  30 Oct 2022 11:25 AM GMT
Next Story