Telugu Global
Cinema & Entertainment

Lawrence | రజనీకాంత్, చిరంజీవిని కలిపి సినిమా తీస్తా

Lawrence - చిరంజీవి, రజనీకాంత్ కోసం తన దగ్గర ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీగా ఉందంటున్నాడు లారెన్స్.

Lawrence | రజనీకాంత్, చిరంజీవిని కలిపి సినిమా తీస్తా
X

లారెన్స్ కేవలం డాన్స్ మాస్టర్, నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. నాగార్జున లాంటి స్టార్ హీరోను డైరక్ట్ చేశాడు. ఇప్పుడు అవకాశం వస్తే ఏకంగా చిరంజీవి, మహేష్ ను పెట్టి మల్టీస్టారర్ తీస్తానంటున్నాడు. జిగర్ తాండా-2 ప్రమోషన్స్ లో పాల్గొన్న లారెన్స్.. ఇంకా ఏమన్నాడంటే..

- డాన్స్‌, ఫైట్స్‌, యాక్ష‌న్స్ చేయాలంటే క‌ష్ట‌ప‌డాలి. కానీ మా డైరెక్ట‌ర్‌ జిగర్తాండా-2లో అలాంటివేం చేయొద్ద‌ని చెప్పారు. అంత కంటే కావాల్సిదేముంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్లే యాక్ట్ చేశాం.

- ఓ పీరియాడిక్ మూవీ ఇది. మంచి బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉంటుంది.

- సినిమాలో మంచి యాక్ష‌న్ పార్ట్‌తో పాటు సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో కొత్త‌గా ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన రాఘ‌వ లారెన్స్‌ను కాకుండా కొత్త లారెన్స్‌ను చూస్తారు.

- డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారు ఏం చెప్పారో దాన్ని చేసుకుంటూ వెళ్లాం. ఎందుకంటే నేను కూడా డైరెక్ట్ చేశాను. మ‌నం డైరెక్ష‌న్ చేస్తున్న‌ప్పుడు మ‌రొక‌రు ఇన్‌వాల్వ్ అయితే ఒప్పుకోం క‌దా.. ఆ సంగ‌తి నాకు తెలుసు. కాబ‌ట్టి నేను కానీ, సూర్య‌గారు కానీ డైరెక్ష‌న్‌లో ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేదు.

- త్వ‌ర‌లోనే ముని 5, కాంచ‌న 4 మొద‌లు పెడుతున్నాను.

- ర‌జినీకాంత్‌గారి సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నానంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దాని గురించి ఇప్పుడేం మాట్లాడ‌లేను. అన్నీ క‌రెక్ట్‌గా కుదిరితే మేక‌ర్స్ చెబుతారు.

- సూప‌ర్‌స్టార్‌గారికి, మెగాస్టార్‌గారికే కాదు.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించేంత మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్ట్ కూడా నా ద‌గ్గ‌ర ఉంది. అవకాశం ఇస్తే కచ్చితంగ ాసినిమా చేస్తా..

- కరోనాకు ముందు చారిటీ ట్రస్ట్ పెడదామని అనుకున్నాను. కానీ కుదరలేదు. చారిటీకి సపోర్ట్ చేయాలనుకునే మంచి వ్యక్తులు దొరకాలి. లేకపోతే కష్టం. అలాంటి వ్యక్తుల కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఓ రాఘవేంద్రస్వామిగారి గుడి కట్టాలని అనుకుంటున్నాను. తప్పకుండా అన్నీ చేస్తాను.

First Published:  6 Nov 2023 5:01 PM GMT
Next Story