Telugu Global
Cinema & Entertainment

Chandramukhi 2 | రజనీకాంత్ పాత్రలో లారెన్స్, ఫస్ట్ లుక్ రిలీజ్

Chandramukhi 2 - రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది.

Chandramukhi 2 | రజనీకాంత్ పాత్రలో లారెన్స్, ఫస్ట్ లుక్ రిలీజ్
X

కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ గమనిస్తే... రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నాడు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్ర‌త్వం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది.

ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ లో వెల్లడించారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు.




First Published:  1 Aug 2023 5:39 AM GMT
Next Story