Telugu Global
Cinema & Entertainment

Chandramukhi 2 | చంద్రముఖి-2 మరిచిపోలేని సినిమా అంటున్న లారెన్స్

Chandramukhi 2 - చంద్రముఖి2 చేయడం తన అదృష్టం అంటున్నాడు లారెన్స్. రజనీకాంత్ కు థ్యాంక్స్ చెప్పాడు.

Chandramukhi 2 | చంద్రముఖి-2 మరిచిపోలేని సినిమా అంటున్న లారెన్స్
X

తన కెరీర్ లో చంద్రముఖి2 సినిమాను మరిచిపోలేనన్నాడు నటుడు లారెన్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ పోషించిన పాత్రను, తను పోషించడం, కంగనా రనౌత్ లాంటి నటితో నటించడం లాంటివి తనకు మంచి అనుభూతులుగా చెప్పుకొచ్చాడు.

"సూప‌ర్‌స్టార్‌ చేసిన ఆ పాత్ర‌ను నేనెంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించ‌ లేదు. నా పాత్ర‌కు నేను న్యాయం చేస్తే చాల‌ని అనుకుని చాలా భ‌య‌ప‌డుతూ న‌టించాను. క‌చ్చితంగా సినిమా మీ అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అనుకుంటున్నాను. కంగ‌నా ర‌నౌత్ వంటి పెద్ద స్టార్‌తో న‌టించ‌టం ల‌క్కీ. ముందు ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్ట‌గానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భ‌య‌ప‌డ్డాను. ఆ విష‌యం ఆమెకు చెప్ప‌గానే ఆమె సెక్యూరిటీని బ‌య‌ట‌కు పంపేశారు. వాసుగారితో ఇది వ‌ర‌కు శివ‌లింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ‘చంద్రముఖి2’ చేశాం. ఈ సినిమా చేస్తున్నా అని అనుకున్న త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారికి ఫోన్ చేసి విష‌యం చెప్పాను. తర్వాత కలిశాను."

చంద్రముఖి 2 సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు లారెన్స్. కేవలం రజనీకాంత్ బిజీగా ఉండడం వల్లనే ఈ సినిమాలో నటించలేకపోయారని, అలా ఆ అదృష్టం తనను వరించిందని చెప్పుకొచ్చారు

"వాసుగారు ‘చంద్రముఖి2’ మూవీ చేస్తున్నామ‌ని అనౌన్స్ చేయ‌గానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. ఆయ‌న‌తో ఫోన్ చేసి మాట్లాడితే ర‌జినీగారు బిజీ షెడ్యూల్ వ‌ల్ల చేయ‌టం లేదు మ‌రో హీరోతో చేయాల‌నుకుంటున్నాన‌ని అన్నారు. స‌రే క‌థ ఎప్పుడు చెబుతార‌ని అన‌గానే సాయంత్రం క‌ల‌వ‌మ‌ని అన్నారు. నేను వెళ్ల‌గానే ఆయ‌న క‌థ చెప్పారు. నాకెంతో న‌చ్చింది. ర‌జినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను న‌టించ‌టం అంటే ఆ రాఘ‌వేంద్ర‌స్వామిగారి అదృష్టం అని అనుకోవాలి."

ఈ సినిమాలో వేట్టయార్ అనే పాత్ర పోషించాడు లారెన్స్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత కీరవాణి సంగీతం అందించారు. అలానే లెజెండ్ కమెడియన్ వడివేలు నటించారు. వీళ్లిద్దరూ తన ప్రాజెక్టులో ఉండడం తన అదృష్టం అన్నాడు లారెన్స్.

First Published:  23 Sept 2023 5:57 PM GMT
Next Story